![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -705 లో.. రిషిని ఎవరు పట్టించుకోవట్లేదని దేవయాని ఫణింద్రతో చెప్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన జగతి, మహేంద్రలను.. రిషి ఎక్కడికి వెళ్ళాడని దేవయాని అడుగుతుంది. వాళ్ళు మాకు తెలియదని చెప్పడంతో.. "అయినా మీకెందుకు తెలుస్తుందిలే. మీరు రిషి గురించి పట్టించుకోరు కదా" అని దేవయాని అంటుంది.
మరోవైపు బయటకెళ్ళాలని వసుధారని రెడీ అవ్వమని రిషి చెప్తాడు. ఆ తర్వాత కాసేపటికి వసుధార రెడీ అయి వచ్చి.. పదండి సర్ వెళదాం అని అంటుంది. ఈ డ్రెస్ ఏంటి? బయటికి వెళ్ళినప్పుడు ఇలాగేనా రెడీ అయ్యేది.. నేను వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేస్తాను. నువ్వు రెడీ అయి రమ్మని చెప్పి రిషి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వసుధార ఎక్కడికి వెళ్లాలో చెప్పకుండా ఎలా రెడీ అవుతారు అని అనుకొని జగతికి కాల్ చేస్తుంది. "రిషి సర్ ఎక్కడికో రమ్మని రెడీ అవమన్నాడు. రెడీ అయితే ఇలా కాదు మళ్ళీ రెడీ కావాలని చెప్పాడు. ఏంటి మేడం రిషి సర్ వరస.. నా మీద ఏంటి ఈ దబాయింపు" అని అని వసుధార అనగానే.. ప్రేమ ఉంది కాబట్టే ఆ దబాయింపు అని జగతి అంటుంది. ఇక వసుధార చీరకట్టుకొని రెడీ అయి రిషి ముందుకు వెళ్తుంది. అలా చీరకట్టులో వసుధారని చూస్తూ రిషి ఉండిపోతాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి అక్కడ నుండి బయల్దేరి వెళ్తారు. మరోవైపు జగతి, మహేంద్రలు మాట్లాడుకుంటారు. రిషి, వసుధారలు ఎక్కడికి వెళ్ళారని గెస్ చేస్తుంటారు. సరదాగా అలా బయటికెళ్లారు కదా ఇప్పటికైనా వాళ్ళ మధ్య మనస్పర్ధలు తొలగిపోవాలి అని మహేంద్రతో జగతి అంటుంది.
ఆ తర్వాత మినిస్టర్ గారి ఇంటి ముందు రిషి కార్ అపుతాడు. ఇంట్లోకి వెళ్తూ.. "ఈ ప్రపంచం దృష్టిలో మనం భార్యభర్తలం కదా.. పదండి శ్రీమతి గారు" అని రిషి అనగానే వసుధార సంతోషపడుతుంది. ఇక ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని లోపలికి వెళ్తారు. మినిస్టర్ గారు రిసీవ్ చేసుకొని భోజనం చేస్తూ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |